Behind Someone Movie Review and Rating
బిహైండ్ సమ్ వన్ రివ్యూ & రేటింగ్ !!!
నటీనటులు:
రాజ్ సూర్యన్. నివిక్షా నాయుడు,సహర్ కృష్ణ ,రవి బాబు, అజయ్, సుమన్ తదితరులు
బ్యానర్ : కాయిన్ ఎర్త్ క్రియేషన్స్
ప్రొడ్యూసర్ : డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్
కో ప్రొడ్యూసర్ : సింగవరం సురేష్ కుమార్ సింగ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పండు గాయల సుబ్బయ్య
డైరెక్టర్ అజయ్ నాలి
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆనెమ్
మ్యూజిక్ : విజయ్ కురవ్ కుల్ల
ఎడిటింగ్ : క్రాంతి.ఆర్కే
లిరిక్స్ : రాంబాబు గోశాల
కొరియోగ్రఫీ :రజిని
ప్రొడక్షన్ డిజైనర్ : యోగానంద్
ఫైట్స్ : రవి
స్టిల్ : ఎస్.మనీ చిన్న శ్రీకాంత్
అసిస్టెంట్ ఎడిటర్ : సంతోష్ పెద్ది
డిజిటల్ : ధీరజ్, ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ : తమిళ్ చేజియన్
పి ఆర్ ఓ : లక్ష్మి నివాస్
కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “బిహైండ్ సమ్ వన్” (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
![Behind Someone Movie Review and Rating](https://moviezapp.com/wp-content/uploads/2022/10/img-20221005-wa0028582303910618992944-682x1024.jpg)
కథ:
నగరంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న హత్యలను ఎవ్వరూ కనిపెట్టలేరు. అసలు ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై ఆశిష్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక గ్యాంగ్ కారణం గానే హత్యలు జరుగుతున్నాయని ఆశిష్ గ్రహించి వారిని పట్టుకుంటాడు. ఈ హత్యల్లో ఆశిష్ ప్రేయసి సిరి కూడా చనిపోతుంది, ఈ కేసు మరింత వేగంతో దర్యాప్తు జరుగుతుంది, ఈ క్రమంలో అజయ్ కేసును మరింత ముమ్మరం చేస్తాడు. అలాగే సుమన్ కూడా ఈ కేసును టేకాప్ చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఆ హత్యలు చేసే గ్యాంగ్ ఏమయ్యారు ? అసలు ఈ గ్యాంగ్ హత్యలు ఎందుకు చేస్తున్నారు ? ఆశిష్ వారిని ఏం చేశాడు ? సుమన్ మరియు అజయ్ కు ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి ? ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన రవిబాబు ఈ ముఠాను ఏం చేశాడు వంటి విషయాలు తెలియాలంటే బిహైండ్ సమ్ వన్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ అజయ్ నాలి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. ఒక క్రైమ్ సబ్జెక్ట్ కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాను ఆశక్తికరంగ తెరకెక్కించారు. నిర్మాత డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ మంచి ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తీశారు.
నటుడు రాజ్ సూర్యన్ తన నటనతో ఆకట్టుకున్నాడు, నివిక్షా నాయుడు,సహర్ కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు ,రవి బాబు ఒక కీ రోల్ లో కనిపించి సర్ప్రైజ్ చేసాడు. అజయ్ రోల్ సినిమాకు మెయిన్ ప్లస్. హంతకులను వేటాడి చంపే ఎపిసోడ్ లో అజయ్ నటన సూపర్. సుమన్ రోల్ చిన్నదే అయిన ఆలోచింపజేసే పాత్రలో నటించి మెప్పించారు.
వెంకట్ ఆనెమ్ సినిమాటోగ్రఫీ బాగుంది, కథకు తగ్గట్లు లొకేషన్స్ ఎంచుకున్నారు, కెమెరా వర్క్ బాగుంది. విజయ్ కురవ్ కుల్ల నేపధ్య సంగీతం బాగుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన విధంగా బాగా కొట్టాడు ఆర్ఆర్. రాంబాబు గోశాల లిరిక్స్ బాగున్నాయి. క్రాంతి.ఆర్కే ఎడిటింగ్ నీట్ గా ఉంది, ల్యాగ్ లేకుండా షాట్ అండ్ స్వీట్ గా బాగా కట్ చేశారు.
ప్రస్తుతం అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద తెరకెక్కిన బిహైండ్ సమ్ ఒన్ సినిమా అందరిని ఆలోచింపజేస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఆడియన్స్ కు కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
చివరిగా: బిహైండ్ సమ్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది.
రేటింగ్: 3/5