Dhwani telugu movie review and rating !!!
ధ్వని మూవీ రివ్యూ & రేటింగ్ (Dhwani telugu movie review and rating).
వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధ్వని. నాగ దుర్గారావు సానా దర్శకత్వం వహించారు. పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మాతలు. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
ముగ్గురు స్నేహితులు అరుణ్, సాగర్, మరియు కిరణ్ సరదాగా కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని అనుకోని కారణాల వల్ల అరుణ్ తలకు దెబ్బ తగులుతుంది, ఆ క్రమంలో అతనికి వినికిడి సమస్య వస్తుంది . ఇలా ఉన్న అతని జీవితంలోని చిత్ర వస్తుంది. వీరిద్దరూ వివాహం చేసుకుంటారు. అంతా బాగా జరుగుతున్న సమయంలో అరుణ్ కు ఒక పెద్ద మోసం జరుగుతుంది. అసలు ఆ మోసం తనకు ఎవరు చేశారు. స్వయానా డాక్టరయిన అరుణ్ జీవితంలో ఎం జరిగింది ? చివరికి అతను ఏమయ్యాడు ? చివర్లో చిత్ర తీసుకున్న నిర్ణయం ఏమిటి వంటి అంశాలు తెలియాలంటే ధ్వని సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ధ్వని చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందిన ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు నాగ దుర్గారావు సానా సినిమాను అత్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.
హీరో వినయ్ పాణిగ్రహి సౌండ్ ఎఫెక్ట్ తో బాధపడుతున్న యువకుడి పాత్రలో బాగా చేశాడు. త్రినాథ్ వర్మ మరియు రవీందర్ రెడ్డి తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. హీరోయిన్ భానవ సాగి నటనతో పాటు అభినయంతో మెప్పించింది.
కెమెరామెన్ శశాంక్ శ్రీరామ్ కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పాలి. లైటింగ్ లొకేషన్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
సంగీతం అందించిన ప్రతీక్, ఆనంద్ నంబియార్ పాటలతో పాటు నేపధ్య సంగీతం బాగా అందించారు.. అన్ని సినిమాకు బాగా కుదిరాయి.
కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అదే తరహాలో వచ్చిన ధ్వని సినిమా అందరిని అలరిస్తుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏక్కడా బోరింగ్ లేకుండా ట్విస్టులతో సాగే ధ్వని సినిమాను అన్ని ఏజ్ గ్రూప్స్ వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.
చివరిగా: ధ్వని సరికొత్త అనుభూతి.
రేటింగ్: 3.5/5