Mr Lonely Telugu Movie (2021) Review and Rating
మిస్టర్ లోన్లీ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ముగ్గురు అమ్మాయిలు మూడు స్టేజెస్ లో (స్కూల్ ఏజ్, డిగ్రీ డేస్, ఆఫీస్ డేస్) ఒకే అబ్బాయిని వాడుకొని మోసం చేస్తే ఆ అబ్బాయి ఏం చేశాడు అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. ఆ అబ్బాయి పాత్రలో నూరాజ్ మణిసాయి (ఆదిత్య) నటించాడు, ముగ్గురు అమ్మాయిలు అను (లోహిత ), మార్యన్ (కీయ) పావని (సోనాలి) పాత్రల్లో నటించారు.
విశ్లేషణ:
డైరెక్టర్ హరీష్ కుమార్ సినిమాను నడిపించిన విధానం బాగుంది, మంచి కథాంశంను తీసుకొని
యంగ్ హీరోయిన్స్ తో చక్కటి నటన రాబట్టుకున్నాడు. కాండ్రేగుల ఆదినారాయణ ఈ సినిమాకు కథ సమకూర్చడమే కాకుండా స్వయంగా నిర్మించారు. యువతకు కావాల్సిన అన్ని అంశాలను ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. మొదటి పదినిమిషాలు కొంత బోరింగ్ ఉన్నప్పటికీ తరువాత నుండి కథలో పరకాయ ప్రవేశం చేసినట్లు ప్రేక్షకుడు కథలో నీలం అవుతాడు. కాలేజీ లో జరిగే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ద్వితీయ భాగంలో అక్కడక్కడా హీరో మందు కొట్టే సన్నివేశాలు కొంత చిరాకు అనిపించినా ఒక్కసారిగా పావని అనే పాత్ర తెరమీదకు వచ్చేసరికి పేక్షకులకు కథ పైన ఆసక్తి కలుగుతుంది, ఆ అమ్మాయి పాత్రను చూపించిన విధానం బాగుంది, సినిమాకు పావని పాత్ర మరో హైలెట్. హీరో ఫ్రెండ్ సురేష్ పాత్ర మరో ప్లస్, ఎమోషన్ సన్నివేశాల్లో అతను బాగా నటించాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను అద్భుతంగా తీశారు కెమెరామెన్ ఆనంద్ గార. మిస్టర్ లోన్లీ సినిమాకు ఆరోప్రాణం సంగీతం, పాటలతో పాటు రీ రికార్డింగ్ బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజాన్ డిడ్ గ్రేట్ జాబ్. హీరోగా నోరజ్ బాగా నటించాడు. అతనికి మంచి భవిషత్తు ఉంది. హీరోయిన్ సోనాలి బాగా నటించింది.
ప్లస్ పాయింట్స్:
కథ, సంగీతం, కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్, మొదటి పది నిమిషాలు, ప్రొడక్షన్స్ వ్యాల్యూస్
ప్రతి ప్రేమికుడు చూడవలసిన సినిమా మిస్టర్ లోన్లీ. యువత మాత్రమే కాకుండా ఫ్యామిలీలో అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే తల్లి, కొడుకు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి.
మూవీజప్ రేటింగ్: 3/5